లారెన్స్‌ ట్రస్ట్‌లో 20 మందికి కరోనా పాజిటివ్‌

చెన్నైలోని అశోక్ నగర్ లో చారిటబుల్ ట్రస్ట్

Corona Positive- Lawrence Trust

చెన్నై: ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు రాఘవ లారెన్స్‌ నడుపుతున్న చారిటబుల్‌ ట్రస్టులో ఆశ్రయం పొందుతున్న 20 మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. చెన్నైలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో.. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా చెన్నై కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న పలువురిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారి నమూనాలు సేకరించి పరీక్షించగా, 20 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ వెంటనే వారందరినీ ఆసుపత్రికి తరలించామని వెల్లడించిన గ్రేటర్ చెన్నై అధికారులు, ట్రస్ట్ గెస్ట్ హౌస్ ను మూసివేశారు. ఆ ప్రాంతంలో క్రిమి సంహారాలు చల్లి, ట్రస్ట్ హౌన్ ఉన్న ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/