లక్షకు పైగా కరోనా వైరస్‌ బాధిత కేసులు

3400కు పెరిగిన మరణాలు.. 90 దేశాలకు విస్తరించిన ప్రాణాంతక వైరస్

Coronavirus cases
Coronavirus cases

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈవైరస్‌ 90 దేశాలకు పైగా పాకింది. కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజురోజు పెరుగుతుంది. ఈనేపథ్యలో ప్రపంచవ్యాప్తంగా ఈవైరస్‌ బాధితుల సంఖ్య లక్ష దాటేసింది. మరణించిన వారి సంఖ్య 3400కు పెరిగింది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియాలు బాధిత దేశాలుగా మారాయి. కరోనా దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లతోపాటు మక్కా మసీదు, బెత్లహాంలోని నేటివిటీ చర్చి వంటి ప్రముఖ దర్శనీయ స్థలాలను మూసివేశారు. గతంతో పోలిస్తే చైనాలో కరోనా నిర్దారిత కొత్త కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం కొత్తగా 99 మందికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించగా, 28 మంది మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఒక్క చైనాలోనే 3070కి చేరుకుంది. దక్షిణ కొరియాలో 174 మంది కొత్తగా వైరస్ సోకింది. దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6767కు చేరుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/