బ్రిటన్‌ ప్రధానికి తగ్గని కరోనా లక్షణాలు

వైద్యుల సలహ మేరకు ఆసుపత్రిలో చేరిన ప్రధాని

boris jhonson
boris jhonson

లండన్‌: ప్రపంచంలో కరోనా దేశ ప్రధానిలను సైతం విడవడం లేదు. గత కొద్ది రోజుల క్రితం బ్రిటన్‌ ప్రదాని బోరిస్‌ జాన్సన్‌కు కరోనా సోకగా అప్పటి నుండి సెల్ప్‌ ఐసోలేషన్‌ లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాని వారం రోజులు గడుస్తున్నప్పటికీ, కరోనా లక్షణాలు తగ్గకపోవడంతో తన వ్యక్తిగత వైద్యుని సలహ మేరకు బ్రిటన్‌ ప్రధాని ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని, కాని వారం రోజులుగా కరోనా లక్షణాలు తగ్గడం లేదు, శరీర ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతుండడంతో, ఆసుపత్రిలో చేరినట్లు జాన్సన్‌ పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/