ఏపిలో 365 కు చేరిన కరోనా కేసులు

గడిచిన 12 గంటలలో 2 కరోనా కేసులు నమోదు

coronavirus
coronavirus

అమరావతి: రాష్ట్రంలో గడిచిన 12 గంటలలో మరో 2 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 365 కు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు అత్యధికంగా కర్నూలు జిల్లాలొ 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 51 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/