దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

మొత్తం వైరస్‌ బాధితులు 20,88,611, మృతులు 42,518

Corona cases at a record level in India
Corona cases at a record level in India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ రికార్డుస్థాయిలో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నా యి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 61,537 కేసులు నమోదయ్యాయి.

933 మంది మరణించారు.

ఇప్పటి వరకు దేశంలో కరోనావైరస్‌ బారినపడిన మొత్తం బాధితులసంఖ్య 20,88,611కి చేరిందని కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 14,27,005 మంది కోలుకోగా మరో 6,19,088 మంది దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్య 42,518కి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి(రికవరీ రేటు) 68.32శాతం ఉంది.దేశంలో కరోనా కారణంగా మరణాల రేటు 2.04 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశంలో 2 కోట్ల 33లక్షల 87 వేల 171 మందికి కరోనా పరీక్షలు జరిగా యి.

మహారాష్ట్రలో ఇప్పటివరకు కేసులసంఖ్య 4,90,262కి చేరగా,3,27,281 మంది వరకు కోలుకున్నారు.

17,092మంది ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 2,85,024కి చేరింది. అందులో 2,27,575మంది కోలుకున్నారు.4,690మంది మరణించారు. కర్ణాటకలో కరోనా పాజిటీవ్‌ కేసులసంఖ్య 1,58,254కుచేరింది.అందులో 80,281మంది కోలుకున్నారు.

2,897మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు పాజిటీవ్‌ కేసుల సంఖ్య 1,42,723కి చేరగా 1,28,232మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 4,082మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో 1,13,378మందికి కరోనా సోకింది. 66,834మంది కోలుకున్నారు.

1,981 మంది మరణించారు. పశ్చిమబెంగాల్‌లో కేసుల సంఖ్య 89,666కి చేరింది. 63,060 మంది కోలుకున్నారు. 1,954మంది మరణించారు.

గుజరాత్‌లో పాజిటీవ్‌ కేసుల సంఖ్య 67,699కి చేరగా,50,350మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 2,583మంది మరణించారు.

బిహార్‌లో కరోనా బాధితుల సంఖ్య 71,304కి చేరింది. 44,482 మంది డిశ్చార్జ్‌ కాగా, 369మంది మరణించారు.

అసోంలో కరోనా కేసుల సంఖ్య 55,496కి చేరింది. 38,809 మంది డిశ్చార్జ్‌్‌ అయ్యారు.132మంది మరణించారు.

రాజస్థాన్‌లో 50,157 మందికి వైరస్‌ సోకగా, అందులో 36,195 మంది కోలుకు న్నారు. 767మంది మృతి చెందారు.

డిశాలో ఇప్పటి వరకు 42,550 మందికి కరోనా సోకగా, 28,698 మంది కోలుకున్నారు.247మంది మరణించారు.

హర్యానాలో కరోనా బాధితుల సంఖ్య 39,303కి చేరింది. అందులో 32,640 మంది కోలుకున్నారు. 458మంది మరణించారు.

మధ్య ప్రదేశ్‌లో 37,298 పాజిటీవ్‌ కేసులు నిర్ధారణ కాగా, 27,621మంది కోలుకున్నారు.962మంది మరణించారు.

కేరళలో కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య 30,449కి చేరింది.అందులో 18,333మంది కోలుకున్నారు. 97 మంది మరణించారు.

జమ్ముకశ్మీర్‌లో కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య 23,454కి చేరింది.15,708మంది కోలు కున్నారు. 436 మంది మరణించారు.

పంజాబ్‌లో పాజి టీవ్‌ కేసులసంఖ్య 21,930కిచేరింది. అందులో 14,040మంది కోలుకున్నారు. 539మంది మరణించారు.

జార్కండ్‌లో 14,888మంది కరోనా బారినపడ్డారు. 5,703 మంది కోలుకున్నారు. 136మంది మరణించారు. చత్తీస్‌ఘడ్‌లో 11,408 మందికి వైరస్‌ సోకగా, అందులో 8319 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 87 మంది మరణించారు.

ఉత్తరాఖండ్‌లో 8901 మందికి కరోనా సోకింది. అందులో 5731 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 112 మంది మరణించారు.

గోవాలో 7423మందికి కరోనా సోకగా, అందులో 5287 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 64మంది మరణించారు.

త్రిపురలో ఇప్పటి వరకు 5999 మందికి కరోనా సోకగా, 4084మంది కోలుకున్నారు. 37 మంది మరణించారు.

పుదుచ్చేరిలో 4862 మందికి వైరస్‌ సోకగా, 2,914మంది కోలుకున్నారు. 75 మంది మరణించారు.

మణిపూర్‌లో 3093మందికి కరోనా సోకగా,1,862మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏడుగురు మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 2,916 మందికి కోవిడ్‌-19 సోకింది. అందులో 1,762మంది కోలుకున్నారు. 14 మంది మరణించారు.

నాగాలాండ్‌లో 2498 మందికి కరోనాసోకింది. అందులో 685మంది కోలుకున్నారు. ఆరుగురు మరణించారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో 2049 మందికి వైరస్‌ సోకగా, 1326 మంది కోలుకున్నారు, ముగ్గురు మరణించారు.

లడక్‌లో 1,855 మందికి కరోనా వైరస్‌ సోకగా, 1,210 మంది కోలుకున్నారు. ఏడుగురు మరణించారు.

దాదర్‌నగర్‌ హవేలీ, డామన్‌ డయ్యులో 1,437 మందికి కరోనా సోకింది. అందులో 1014 మంది కోలుకున్నారు. ఇద్దరు మరణించారు.

చండీఘడ్‌లో 1,874 మందికి సోకగా, 820 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 23 మంది మరణించారు అండమాన్‌ నికోబార్‌లో 1222 కేసులు నమోదయ్యాయి. అందులో 425 మంది కోలుకున్నారు.19 మంది మరణించారు.

మేఘాలయలో 929మందికి కరోనా సోకగా,అందులో 330 మంది కోలుకున్నారు. ఐదుగురు మరణించారు.

సిక్కింలో 854 మందికి కరోనా సోకింది. అందులో 406 మంది కోలుకున్నారు. ఒక్కరు మరణించారు.

మిజోరంలో 537మందికి కరోనా సోకింది. అందులో 286 మంది కోలుకున్నారు. ఇంకెవ్వరు మరణించలేదు. లక్ష్వద్వీప్‌లో ఇంతవరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/