తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచే ఎంపి స్థానాలివే!

jagga reddy
jagga reddy


హైదరాబాద్‌: పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న ముఖ్యమంత్రి నిర్ణయం అభినందనీయం కాని ఈ నిర్ణయాన్ని ఏడాది లోపు అమలు చేస్తే కేసిఆర్‌కు సంగారెడ్డిలో గుడి కడతానని జగ్గారెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..నల్గొండ, మల్కాజ్‌గిరి, ఖమ్మం, భువనగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి, జహీరాబాద్‌ స్థానాలు గెలిచినా ఆశ్యర్యం లేదన్నారు. ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. మైనార్టీలు, క్రిస్టియన్‌లు కాంగ్రెస్‌ వైపే మొగ్గుచూపారని అభిప్రాయపడ్డారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/