పిఏసి ఛైర్మన్‌గా అధీర్‌ రంజన్‌ చౌదరి పేరు ఖరారు

Adhir Ranjan Chowdhury
Adhir Ranjan Chowdhury

న్యూఢిల్లీ: పార్లమెంటు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పిఏసి) ఛైర్మన్‌గా అధీర్‌ రంజన్‌ చౌదరి పేరును కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ పార్లమెంటు సభ్యుడైన చౌదరి ప్రస్తుతం లోక్‌సభలో విపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతగా ఉన్నారు.
పార్లమెంటు నేతలతో కూడిన పిఏసి కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను ఆడిట్‌ చేస్తుంది. పీఏసితో పాటు ఎస్టిమేట్స్‌ కమిటీ(ఈసి), కమిటీ ఆఫ్‌ పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌(సిఒపియూ)లు పార్లమెంటుకు సంబంధించిన ఫైనాన్షియల్‌ స్టాండింగ కమిటీలుడా వ్యవహరిస్తుంటాయి. పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం పిఏసి ఛైర్మన్‌ పదవి ప్రధాన ప్రతిపక్షానికి వెళ్తుంది. లోక్‌సభలో 52 మంది సభ్యులతో కాంగ్రెస్‌ పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/