జమిలి ఎన్నికలకు కాంగ్రెస్‌ మోకాలడ్డు

jamili elections
jamili elections


న్యూఢిల్లీ: వన్‌ నేషన్‌..వన్‌ ఎలక్షన్‌ నినాదంతో ఇవాళ ప్రధాని మోది అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఐతే ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ హాజరు కావడం లేదని స్పష్టం చేసింది. జమిలి ఎన్నికల నిర్వహణను కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. కాని ఈ విధానాన్ని దేశం మొత్తం అమలు చేయాలని కొన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. 2022లో భారత్‌ 75వ స్వతంత్య్ర దినోత్సవ సంబురాలను జరుపుకోనున్నది. అదే సంవత్సరం 150 గాంధీ జయంతి ఉత్సవాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో వన్‌ నేషన్‌..వన్‌ ఎలక్షన్‌ విధానాన్ని అమలు చేయాలని మోది భావిస్తున్నారు. కాని విపక్షాలు జమిలి ఎన్నికలపై ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. బెంగాల్‌ సియం మమతా బెనర్జీ, బిఎస్పీ నేత మాయావతి సమావేశానికి హాజరుకావడం లేదు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/