సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు

cm kcr
cm kcr


హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈనేపథ్యంలో సిఎం కెసిఆర్‌ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలను అమలు చేయడమే జిల్లా అధికార యంత్రాంగం ప్రాధాన్యత ఉండాలి తప్ప ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యత ఉండదని జిల్లా కలెక్టర్లకు సూచించారు. విస్తృత మేధోమధనం, అనేక రకాల చర్చోపచర్చల తరువాతే తమ ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు చేస్తుందని ఆయన తెలిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంబిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు విధానాలు పథకాలు కార్యక్రమాలు అమలుపై కలెక్టర్లు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కెసిఆర్‌ అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో నేడు ప్రగతి భవన్‌లో కెసిఆర్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/