సమ్మెకు దిగుతున్న బొగ్గుగనుల కార్మికులు

coal
coal


కోల్‌కత్తా: బొగ్గుగనుల తవ్వకాల్లో నూరుశాతంవిదేశీప్రత్యక్షపెట్టుబడులను ఆహ్వానించడంపై బొగ్గుగనుల్లోపనిచేస్తున్న కార్మికరంగం పెద్ద ఎత్తుననిరసన వ్యక్తంచేస్తోంది. ఈ విధానానికి నిరసనగా ఈనెల 24వ తేదీన సమ్మెకు దిగుతున్నాయి. కేంద్రస్థానంలోని అనేకయూనియన్లు, ఐఎన్‌టియుసి, ఎఐటియుసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్‌, ఎఐసిసిటియు సంస్థలు ఈ సమ్మెను సమర్ధిస్తున్నాయి. ఐదు కార్మికసంఘాల సమాఖ్యలు సుమారు ఐదులక్షలమందికిపైగా కార్మికులు కోల్‌ ఇండియాలోను, సింగరేణి కలైరీస్‌ కంపెనీ, ప్రభుత్వరంగంలోని బొగ్గుగనుల్లో పనిచేస్తున్నారు. వీరంతా ఇపుడు ఈనెల 24వ తేదీ సమ్మెకు దిగాలనినిర్ణయించారు. నూరుశాతం ఎఫ్‌డిఐ నిబంధనను ఉపసంహరించాలని డిమాండ్‌చేస్తున్నారు. బొగ్గునులతవ్వకాల్లోను, కాంట్రాక్టు ఉత్పత్తిరంగంలోను 100శాతం ఎఫ్‌డిఐని ప్రభుత్వం అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిఎంఎస్‌ మాత్రం ఈ సమ్మెకు దూరంగా ఉంది. అఖిలభారత బొగ్గుకార్మికుల సమాఖ్య ఈమేరకు నోటీసులు జారీచేసింది. కేంద్రానికి ఇందుకు సంబంధించి అన్ని సంఘాలు నోటీసులుసైతం జారీచేసాయి. కోల్‌ ఇండియా అనుబంద సంస్థలు, ఈస్ట్రన్‌ కోల్డ్‌ఫీల్డ్స్‌, సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌, మహానది కోల్‌ఫీల్డ్స్‌ వంటివి మాతృసంస్థలో విలీనం అయినందున ఇపుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగభద్రకు ముప్పు ఏర్పడుతుందని చెపుతున్నారు. తమ డిమాండ్లనుపరిష్కరించనిపక్షంలో తాము నిరవధిక సమ్మెకుసైతం సిద్ధమేనని చెపుతున్నారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/