సిఎం రమేష్‌ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటి దాడులు

cm ramesh
cm ramesh

రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటి దాడులు

అమరావతిµ : కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ఐటి,ఈడీల దాడుల నేపధ్యంలో సీఎం అనుచరులను,ఉభయ సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీని టార్గెట్‌ చేసుకొని ప్రసంగాలు చేసి,కేంద్రంపై తిరగబడ్డ నేతలను టార్గెట్‌ చేసుకొని ఐటి దాడులు కొనసాగిస్తున్నారు.ఈ దాడులకు ఏపియేతర రాష్ట్రాల అధికారులచే దాడులు జరుపుతుండడంతో నేతల్లో కలకలం సృష్టిస్తోంది.కేవలం టిడిపి నేతలనే టార్గెట్‌ చేసుకొని దాడుల పరంపరంతో తమను అప్రతిష్టపాలు చేయడానికి,రాష్ట్రంలో టిడిపి శ్రేణులను ఇబ్బందిపెట్టి 2019ఎన్నికలు,కేంద్రంపై రాష్ట్ర టిడిపి నేతలు చేస్తున్న దూకుడుకు కళ్ళెం వేయడానికే ఈ దాడులని విమర్శలున్నాయి.

తాజాగా శుక్రవారం టిడిపి,రాజ్యసభ సభ్యుడు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్‌నాయుడుకు చెందిన హైదరాబాదు,విజయవాడ,కడపజిల్లా పోట్లదుర్తి నివాసగృహాల్లోను,ఆయనకు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలపై,ఆయన బంధువులు,సన్నిహితుల ఇళ్ళపై ఏకకాలంలో దాడులను ఏపి,తెలంగాణా,ఇతర రాష్ట్రాల అధికారుల ప్రమేయంతో దాడులు కొనసాగిస్తున్నారు.దీంతో టిడిపినేతల్లో ఆందోళన మొదలైంది.వాస్తవంగా శుక్రవారం ఢిల్లీ టిడిపి ఎంపీలు,రాజ్యసభ సభ్యులు విభజన చట్టం హామీలు,ఏపికి ప్రత్యేకహోదాపై ఆందోళనకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఆందోళనకు సీఎం రమేష్‌నాయుడు కీలకపాత్ర నేపధ్యంలో ఈ దాడులు మొదలైయ్యాయి.

గతంలో రాజ్యసభలో ప్రధాని మోదీపై విరుచుకుపడడం,తారాస్థాయిలో విమర్శించడంతోనే దాడులు మొదలైయ్యాయని ఆరోపణలున్నాయి. దాడులు నేపధ్యంలో హైదరాబాద్‌ నుండి సీఎం రమేష్‌ కంపెనీల దాడుల్లో ఉన్న ఐటి అధికారులు ఢిల్లీలో ఉన్న రమేష్‌తో ఫోన్లో సంప్రదించి హాజరు కావాలని కోరినట్లు తెలిసింది.తన కార్యాలయాల్లోను,నివాసాల్లోను ఎటువంటి ఐటికి మించిన ఆస్తులు,ఆదాయం,రికార్డులు లేవని ఇక దాడులు చేసిన అధికారుల ద్వారా తెలంగాణా,కేంద్రం దాడుల్లో ఏమి లభ్యం కాకున్నా లభ్యమైనట్లు సృష్టిస్తారని అనుమానం వ్యక్తంచేస్తూ అధికారులపై ఢిల్లీనుండి ఆరోపణలు చేశారు.అలాగే ఏకకాలంలో తన ఇళ్ళపై తెలంగాణ అధికారులచే దాడులు చేయించడంలో అంతరంగం ఏమిటిన ప్రశ్నించారు.కేంద్రం కక్షకట్టి ఈ దాడులు చేయంచడంపై తమ ఉద్యమం ఆగదని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు.ఇదిలా ఉండగా ఇటివల టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు,ఎమ్మెల్సీ రవీంద్ర,ఎమ్మెల్యే రామారావు ఇళ్ళు,కార్యాలయాలు, శ్రీకాకుళం,విజయవాడ, ప్రకాశం,కృష్ణా,హైదరాబాదు,జగ్గంపేట తదితర ప్రాంతాల్లో ఐటి అధికారులు సుమారు 18కంపెనీలపై దాడులు విదితమే.