17 రోజులు మద్యం షాపుల మూసివేత

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

liquor shop
liquor shop

Amaravati: స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లిక్కర్ షాపులను బంద్ చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా 17 రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. కాగా, మూడు దఫాలుగా ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/