గొగోయ్‌ క్లీన్‌చిట్‌పై సుప్రీం ఎదుట ఆందోళన, 144 సెక్షన్‌

protest outside supreem
protest outside supreem

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కి క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో మహిళా హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు నిరసనకు దిగారు. అంతర్గత విచారణ కమిటీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కేసుపై పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు 30 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద 144 సెక్షన్‌ విధించారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/