బ్యాటింగ్‌ శైలిని ప్రపంచకప్‌లో కూడా ఇలాగే కొనసాగిస్తా..

వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌

chris gayle
chris gayle

వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ తన బ్యాటింగ్‌ పట్ల సంతృప్తిగా ఉన్నానని, వరల్డ్‌కప్‌కు సన్నద్ధమవుతున్న సందర్బంలో అతడు మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్‌లో తనకెంతో అనుభవం ఉందని, ప్రపంచకప్‌లో పరుగుల వరద పారుతుందని అనుకుంటున్నానని, ఈ సమరం ఎలా ఉండబోతుందో తనకు అవగాహన ఉందని , తన బ్యాటింగ్‌ శైలిని ఇలాగే కొనసాగిస్తానని, కానీ కొంతమంది తన ఫిట్‌నెస్‌పైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాను మానసికంగా చాలా ధృడంగా ఉన్నానని, శారీరక సమస్యలు తనను అంతగా వేధించవని, ఇంకా చెప్పాలంటే రెండు నెలలుగా తాను ఫిట్‌నెస్‌ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. జిమ్‌కు కూడా వెళ్లడం లేదు, కావాల్సినంత విశ్రాంతి తీసుకుంటున్నాను. ప్రపంచకప్‌లో తన మానసిక ధృఢత్వం, అనుభవమే తనకు తోడ్పడుతాయని తెలిపాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/