అఫ్రిది రికార్డు బ్రేక్‌ చేసిన గేల్‌

chris gayle
chris gayle,


కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ మరో రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు తీసిన క్రికెటర్‌గా గేల్‌ నిలిచాడు. బుధవారం ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో అతను ఏకంగా 12 సిక్సర్లు బాది 135 పరుగులు చేశాడు. దీంతో అంతర్జాతీయ సిక్సర్ల సంఖ్య 488కు చేరింది. అఫ్రిది 524 మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లు చేసిన రికార్డును గేల్‌ 444 మ్యాచ్‌ల్లో 488 సిక్సర్లు చేసి బద్దలు కొట్టాడు. గేల్‌ వన్డేల్లో 287 సిక్సర్లు, టెస్టుల్లో 98, టి20ల్లో 103 సిక్సర్లు చేసి రికార్డు నెలకొల్పాడు.