ఉత్తర కొరియా పర్యటనలో జిన్‌పింగ్‌

అణుశక్తికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం

kim jong unn, jinping
kim jong unn, jinping

ప్యాంగ్‌యాంగ్‌: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ దంపతులు ఉత్తర కొరియాకు చేరుకున్నారు. ఆ దేశ సుప్రీం లీడర్‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో సమావేశం కోసం అక్కడకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఉత్తరకొరియాలో పర్యటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహబంధంలో మరో నూతన అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈ సమావేశం తోడ్పడనుంది. ఉత్తర కొరియాలో మీడియాకు ఎన్నో ఆంక్షలు ఉంటాయి. ఉత్తర కొరియాలో పర్యటించాల్సిందిగా కిమ్‌ నుంచి జిన్‌పింగ్‌కు ఆహ్వానం అందింది.

వీరిద్దరి భేటి అణుశక్తికి సంబంధించే చర్చించుకునే అవకాశాలున్నాయి. 2008లో జిన్‌పింగ్‌ ప్యాంగ్‌యాంగ్‌ వచ్చారు. అప్పుడాయన చైనాకు వైస్‌ ప్రెసిడెంటుగా ఉన్నారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తండ్రి జోంగ్‌ ఇల్‌ ఆ సమయంలో ఉత్తర కొరియాను పరిపాలించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/