భారత జోడీ పరాజయం

Satwik-Chirag

ప్యూజో (చైనా) : చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత జోడీ సాత్విక్, చిరాగ్ పరాజయం పాలయ్యారు. వీరు ప్రపంచ నెంబర్ వన్ జోడీ ఇండోనేషియాకు చెందిన మార్కస్ ఫెర్నాల్దీ-కెవిన్ సంజయ చేతిలో ఓడిపోయారు. 16-21, 20-22 తేడాతో పరాజయం పాలయ్యారు. భారత క్రీడాకారులు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరకు ఓడిపోక తప్పలేదు. రెండో గేమ్ లో గట్టి పోటీ ఇచ్చిన భారత క్రీడాకారులు 22-20 గేమ్ తో పాటు మ్యాచ్ కోల్పోయారు. ఫ్రెంచ్ ఓపెన్ లోనూ మార్కస్- కెవిన్ భారత్ జోడీని (సాత్విక్, చిరాగ్) ఓడించింది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com