పాకిస్థాన్‌ కోసం చైనా అత్యాధునిక యుద్ధనౌకలు

China building 'most advanced' naval warships for Pakistan
China building ‘most advanced’ naval warships for Pakistan

బీజింగ్‌: పాకిస్థాన్‌ కోసం చైనా అత్యాధునిక యుద్ధనౌకను నిర్మిస్తున్నది. రెండు దేశాల మధ్య ఆయుధ ఒప్పందంలో భాగంగా ఈ యుద్ధనౌకను తయారు చేసి ఇస్తున్నది. అంతేకాక హిందూ మహాసముద్రంలో ఇండియాకు చెక్‌ పెట్టడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న చైనా ఈ అవకాశాన్ని అందుకోసం కూడా వాడుకుంటున్నది. అత్యాధునిక ఆయుధ వ్యవస్థ,యాంటీ షిప్, యాంటీ సబ్‌మెరైన్ వ్యవస్థలతోపాటు గగనతల రక్షణ వ్యవస్థ ఈ యుద్ధనౌకలో ఉన్నట్లు చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. షాంఘైలోని హుడాంగ్ ఝోన్‌ఘువా షిప్‌యార్డ్‌లో ప్రస్తుతం ఈ యుద్ధనౌకను తయారు చేస్తున్నారు.