చీఫ్‌ జస్టిస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు!

ranjan gogoi
ranjan gogoi, chief justice

న్యూఢిల్లీ: చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగో§్‌ుపై లైంగిక ఆరోపణలు వచ్చినట్లు సొలసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఐతే తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగో§్‌ు కొట్టిపారేశారు. ఇవాళ సుప్రీంకు చెందిన త్రిసభ్య ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమైంది. న్యాయవ్యవస్థ ప్రమాదంలో ఉందని చీఫ్‌ జస్టిస్‌ అన్నారు. త్రిసభ్య ధర్మాసనంలో గగో§్‌ుతో పాటు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలున్నారు. హుటాహుటిన సుప్రీం స్పెషల్‌ సిట్టింగ్‌ ఏర్పాటు చేసింది. ఇలాంటి ఆరోపణలకు స్పందించేందుకు మరింత దిగజారదలుచుకోలేదని గగో§్‌ు అన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/