మోడి వచ్చి ఆరేళ్లు.. ఇంకా అచ్చే దిన్ రాలేదు

దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుందని, ట్యాక్స్ రెవెన్యూ దారుణంగా పడిపోయిందని, ద్రవ్యోల్బణం పెరుగుతోందని విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌కు మూడు ఇంకా మూడు రోజుల సమయంలో ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడి, కేంద్ర మంత్రులు పై ఆయన ఈ విమర్శలు చేశారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతల తీరు కూడా సరిగా లేదని… అభ్యంతరకరమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడి పాలన వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ‘అచ్చే దిన్’ రాలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడి తో పాటు ఆయన మంత్రివర్గ సహచరులందరూ వాస్తవాలను అంగీకరించడం లేదని చిదంబరం అన్నారు. ప్రజలంతా దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటున్నారని… మీ తిట్లను, వాక్చాతుర్యాన్ని కాదని అన్నారు.

ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మీరు మూడు విషయాల గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. 2019 జనవరిలో 2 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2019 డిసెంబర్ నాటికి 7.35 శాతానిక ఎందుకు పెరిగింది? 2019-20 ఆర్ఠిక సంవత్సరానికి గాను రూ. 2.5 లక్షల కోట్ల ట్యాక్స్ రెవెన్యూలు వస్తాయని వేసిన బడ్జెట్ అంచనాలు ఎందుకు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళలు, పిల్లల కోసం అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఎందుకు తగ్గాయి? ఈ మూడు అంశాలపై మాట్లాడాలని చిదంబరం సవాల్ విసిరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/