భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం

80 కోట్ల మందికి లబ్ది

nirmala sitaraman
nirmala sitaraman

దిల్లీ: ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ విదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ వల్ల దేశంలో చాలా మంది వలస కార్మికులు, మహిళలు, పేదలపై తీవ్ర ప్రభావం పడుతుండడంతో, వీరికి మేలు చేసేలా కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది. 1,70,000 కోట్ల రూపాయల ఈ ప్యాకేజీని గరీబ్‌కళ్యాణ్‌ పథకం పేరుతో అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ ప్యాకేజీ ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి లాభం చేకూరుతుందని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/