ఏపి రాజధానిపై కేంద్రం కీలక నిర్ణయం

రాజధానిపై నిర్ణయం రాష్ట్రాలదే

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: ఏపిలో మూడు రాజధానుల అంశంపై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పార్లమెంట్‌లో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ రాజధాని అంశంపై తొలిసారిగా స్పందించింది. టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాజధానిపై రాష్ట్రాలదే తుది నిర్ణయమని.. ఇందులో కేంద్రం కలగజేసుకోలేదని స్పష్టం చేశారు. 2015 ఏప్రిల్ 4నలో ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని.. కానీ ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా రిపోర్టుల్లో చూశామని తెలిపారు. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును టిడిపి , బిజెపి , జనసేనతో పాటు వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలని.. పరిపాలనా వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి జరగదని మండిపడుతున్నాయి. సేవ్ అమరావతి పేరుతో అమరావతి పరిరక్షణ జేఏసీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు విపక్షాలన్నీ మద్దతిస్తున్నాయి. రాజధాని కోసం దాదాపు 50 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/