వరల్డ్‌కప్‌ వీక్షించేందుకు టాలీవుడ్‌ తారలు

mahesh babu, venkatesh
mahesh babu, venkatesh

హైదరాబాద్‌: మే 30 నుండి లండన్‌లో ప్రారంభం కానున్న క్రికెట్‌ మహాసంగ్రామాన్ని వీక్షించేందుకు టాలీవుడ్‌ తారలు సన్నద్ధమయ్యారు. క్రికెట్‌ మీద ఉన్న అభిమానంతో సినీతారలు లండన్‌ వెళ్లడానికి వారి షెడ్యూల్‌ను అడ్జస్ట్‌ చేసుకుని మరీ వెళ్లనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్‌, మహేశ్‌బాబు, సురేష్‌బాబుకు క్రికెట్‌ అంటే ప్రత్యేక ఇష్టం. ఛాన్స్‌ దొరికితే వారు గ్రౌండ్‌లో ప్రత్యక్షమవుతుంటారు. ఐతే ఈ ఏడాది జరగనున్న వన్డే విశ్వసమరాన్ని వీక్షించేందుకు చాముండేశ్వరినాథ్‌ నేతృత్వంలో సురేశ్‌బాబు, కామినేని శ్రీనివాస్‌, విక్టరీ వెంకటేశ్‌, మహేశ్‌బాబు ఇంగ్లాండ్‌ వెళ్లనున్నారు. జూన్‌ 9, జూన్‌ 13, జూన్‌ 16 తేదీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దేశాలతో ఇండియా మ్యాచ్‌లు ఆడనుండగా, వాటిని వీక్షించేందుకు వీరు ప్లాన్‌ చేసుకున్నారట, ఈ టూర్‌ పూర్తైన తర్వాత మహేశ్‌ అనీల్‌ రావిపూడితో సినిమా చేయనున్నాడు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/