యూకే లోనే తన బర్త్ డే సెలెబ్రేట్

‘డార్లింగ్’ ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్ ఈనెల 23 న తన 40 వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడనే సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ లేదా మరో బర్త్ డే ట్రీట్ ను ఆశిస్తున్నారు.  కొందరైతే ప్రభాస్ తన వివాహానికి సంబంధించిన ప్రకటన చేస్తాడని కూడా కలలు కంటున్నారు. మరి వీటిలో ఏదో నిజం అవుతోందో ఏది కాదో మనకు తెలియదు కానీ  ప్రభాస్ తన జన్మదిన వేడుకలు జరుపుకునే చోటు మాత్రం మారిపోయిందని సమాచారం.
అక్టోబర్ 19 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ మ్యూజిక్ హాల్ లో రాయల్ ఫిల్హార్మోనిక్ వారిచే బాహుబలి ఒరిజినల్ స్కోర్ లైవ్ పెర్ఫార్మన్స్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ‘బాహుబలి’ టీమ్ హాజరవుతోంది.  అయితే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రభాస్ ఇండియాకు తిరిగి వస్తాడని.. ఇక్కడే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని మొదట్లో అనుకున్నారు కానీ ఇప్పుడు ప్లాన్ మారిపోయిందని.. ప్రభాస్ యూకే లోనే తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోవాలని డిసైడ్  అయినట్టు సమాచారం.  ప్రభాస్ తో పాటుగా రాజమౌళి.. రానా.. అనుష్క కూడా ఈ బర్త్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/