కొనసాగుతున్న సీబీఐ, ఈడీ సోదాలు

SUJANA CHOWDARY
SUJANA CHOWDARYSUJANA CHOWDARY

Hyderabad: కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరి ఇల్లు, ఆఫీసులో సీబీఐ, ఈడీ సోదాలు రెండ్రోజులుగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని సుజనా ఇల్లు, ఆఫీసులో తనిఖీలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో ‘బెస్ట్‌ అండ్ కాంప్టన్‌’ పేరుతో సుజనా వ్యాపారం నిర్వహించారు. తప్పుడు ఇన్‌వాయిస్‌లతో రుణాలు పొందినట్లు ఆరోపణలు వస్తుండడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా.. గతంలోనూ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీకి సీబీఐ బదిలీ చేసింది. ఆంధ్రా బ్యాంక్‌కు రూ.71 కోట్ల రుణం ఎగవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా మొత్తం ఐదుగురు డైరెక్టర్లు, ఎండీలపై బెంగళూరు సీబీఐ కేసు నమోదు చేసింది. శనివారం మధ్యాహ్నం సుజనా గ్రూప్‌ డైరెక్టర్లు నలుగురిని అదుపులోకి తీసుకొన్న అధికారులు సుధీర్ఘంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాగుట్ట నాగార్జున హిల్స్‌లోని సుజనా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఆఫీసును సీబీఐ అధికారులు సీజ్‌ చేశారు.  కాగా ఇవాళ సాయంత్రం వరకూ సోదాలు కొనసాగుతాయని తెలుస్తోంది. ఇంతవరకూ ఈ సోదాలకు సంబంధించి అటు సీబీఐ కానీ.. ఇటు ఈడీ అధికారులు గానీ మీడియా మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశాలు  ఉన్నాయి.