హింసాత్మకంగా మారిన కర్ణాటక బంద్‌

bus fire
bus fire


బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం భంగుమన్నది. బంద్‌తో రాష్ట్రంలో నిరసన జ్వాలలు రగులుతున్నాయి. దీనికి కారణం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డి.కె.శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేయడమేనని తెలుస్తోంది. ఇతని అరెస్టును నిరసిస్తూ కర్ణాటకలోని కొన్ని జిల్లాలో బంద్‌కు కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. దీంతో బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ నాయకులు, శివకుమార్‌ అభిమానలు చేరి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులపై రాళ్లను రువ్వారు. అంతేకాక దాదాపు 10 బస్సులకు నిప్పు పెట్టారు. దీంతో ప్రభుత్వం పాఠశాలలు, కాలేజీలకు సెలవును ప్రకటించింది. బస్సులు తగలబెట్టడంతో బస్సు రవాణాను అధికారులు నిలిపివేసారు. దీంతో ప్రజారవాణా స్తంభించింది. కాగా శివకుమార్‌ను బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/