కెన‌డాలోని ఇండియ‌న్ రెస్టారెంట్‌లో పేలుడు

BLAST IN RESTAURENT
BLAST IN RESTAURENT

టొరాంటోః కెనడాలో ఉన్న ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. మిస్సిసౌగా ప్లాజాలో ఉన్న రెస్టాంట్‌లో పేలుడు జరిగింది. ఆ ఘటనలో 15 మంది గాయపడ్డారు. దీన్ని అనుమానాస్పద సంఘటనగా పోలీసులు భావిస్తున్నారు. హురాంటోరియా వీధిలో ఉన్న బాంబే బేల్ ఏరియాను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. పేలుడు వల్ల ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఆ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని టొరంటో ట్రామా సెంటర్‌కు తరలించారు. అయితే బిల్డింగ్‌లో ఏ ప్రాంతంలో పేలుడు జరిగింది, ఆ టైమ్‌లో ఎంత మంది అక్కడ ఉన్నారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదని పోలీసులు చెప్పారు.