ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపికి ఆహ్వానం?

Devendra Fadnavis

Mumbai: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి బిజెపిని ఆహ్వానించనున్నట్లు తెలిసింది. నేటితో మహారాష్ట్ర ప్రభుత్వ కాలపరిమితి ముగిసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ శుక్రవారంనాడు తన పదవికి రాజీనామా చేశారు. దానికి గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సంక్షోభం నెలకొన్న విషయం విదితమే. బిజెపి-శివసేన కూటమి అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. అయితే 50-50 ఫార్ములా అమలు చేయాలంటూ శివసేన పట్టుబట్టింది. ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలు రెండున్నర ఏళ్ల చొప్పున చేపట్టాలని శివసేన డిమాండ్‌ చేస్తోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/