‘భారత్‌’లో సల్మాన్‌ ఫస్ట్‌లుక్‌

BHARAT first look
BHARAT first look


ముంబై: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భారత్‌, అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సల్మాన్‌ వృద్ధిడిగా కనిపిస్తున్న ఈ లుక్‌ను చూసి అభిమానులు షాకయ్యారు. సినిమాలో సల్మాన్‌ 20 నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ రకాల లుక్స్‌లో కనిపిస్తారంటూ మొదటి నుంచి చిత్ర బృందం చెబుతూనే ఉంది. కానీ ఇలాంటి లుక్‌తో ట్విస్ట్‌ ఇస్తారని ఊహించలేదని నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/