భారత్‌ను సందర్శించనున్న ఇజ్రాయెల్‌ ప్రధాని

Benjamin Netanyahu
Benjamin Netanyahu, Israel Prime Minister


న్యూఢిల్లీ: ఎన్నికలు ముగిసినందున ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు సెప్టెంబరులో భారత్‌ వస్తారని దౌత్యవర్గాలు చెప్పాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నెతన్యాహు ఢిల్లీకి రావాల్సి ఉండగా, ఇజ్రాయిల్‌లో ఎన్నికలు ఉన్నందున ఆయన ప్రయాణం సెప్టెంబరు 9కి మారిందన్నారు. నెతన్యాహు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తారన్నారు. భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మెరుగయ్యాయన్నారు. మోడీ భారత ప్రధాన మంత్రిగా మొదటి సారి ఇజ్రాయెల్‌కు 2017లో వెళ్లారు. అదేవిధంగా నెతన్యాహు 2018, జనవరిలో భారత్‌ను సందర్శించి 25 ఏళ్లుగా కొనసాగుతున్న దౌత్య సంబంధాలకు ఊపునిచ్చారు.

గత నెలలో జరిగిన యోగా డే వేడుకను పురస్కరించుకుని భారత భారత రాయబారి టెల్‌ అవివ్‌ పవన్‌ కపూర్‌ మాట్లాడుతూ ఇరుదేశాల ప్రధాన మంత్రుల రాకపోకలతో ఇజ్రాయెల్‌, భారత్‌ సంబంధాలు మరింత వేగవంతమయ్యాయన్నారు. మోడీ, నెతన్యాహులు ప్రధాన మంత్రులుగా ఇరుదేశాలకు రాకపోక సమీకరణాలు సరిచేశారన్నారు. ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌లో భారత ప్రధానిగా మొదటి సారి వెళ్లగా, నెతన్యాహు కూడా భారత్‌కు విచ్చేసారు. ఇజ్రాయెల్‌, భారత్‌ రెండు దేశాల్లోను ఫిబ్రవరి మాసంలో ఎన్నికల సందడి నెలకొంది. అందుకే నెతన్యాహు ఫిబ్రవరిలో భారత్‌కు రావాల్సిన ఉండగా షెడ్యూలింగ్‌లో తేడాలతో ఆయన తన రాకను సెప్టెంబర్‌కు మార్చుకున్నారు.

ఎన్నికల్లో విజయం వరించినప్పటికీ ఏప్రిల్‌ ఆయన ఇజ్రాయెల్‌ పార్లమెంటులో 120 మంది సభ్యులను సమీకరించకపోవడంతో కొత్తగా ఎన్నికలు జరగాల్సి ఉన్నవి. ఈ ఎన్నికలు సెప్టెంబరు 17న జరగనున్నాయి. బాలాకోట్‌ వాయుదాడిలో భారత వైమానిక దళం ఉపయోగించిన ఆయుధాలు, క్షిపణుల కొనుగోలు, రక్షణకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలు ఆయన సందర్శనలో ఉంటాయన్నారు. భద్రతపై కేబినెట్‌ కమిటీ ఆమోదించాల్సిన బిలియన్‌ డాలర్ల 2 ఫాల్కన్‌ ఎడబ్ల్యుఎసిఎస్‌ పెండింగ్‌లో ఉందని, దానిపై కూడా ఇరువైపులా చర్చలు జరుగుతాయన్నారు. అమెరికా, ఇరాన్‌ ఉద్రిక్తతలు కొనసాగుతున్న కేసులో భారత్‌ కూడా ఉన్నందున, ఇజ్రాయెల్‌తో తెహ్రాన్‌ కలవడంతో అమెరికా ఆ ప్రాంతంపై ఒత్తిడి పెంచింది.

ఇజ్రాయెల్‌ రాయబారి మాట్లాడుతూ భారత్‌ ఇరాన్‌ నుండి ఆయిల్‌ దిగుమతులను నిలిపివేయాలని అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఇరాన్‌ ప్రభుత్వంతో భారత్‌కు మంచి సంబంధాలున్నవి. పశ్చిమ ఆసియాలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న మిలియన్ల మంది భారతీయులపై ఈ ప్రభావం పడనుందన్నారు. జి20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడగా, ద్వైపాక్షికం, రక్షణ టెలికమ్యూనికేషన్‌ విషయాలలో చర్చలు జరుపుతున్న నాలుగు ప్రాంతాలలో ఇరాన్‌ కూడా ఒకటని ప్రధాని మోడీ వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/