బెంగళూరులో భవనం కూలి, నలుగురు మృతి

building collapse
building collapse


బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని పులకేశి నగర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం బుధవారం తెల్లవారుజామున కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని శిథిలాల నుంచి బయటకు తీశారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఉత్తరాదికి చెందిన కార్మికులని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పక్కనే ఉన్న మరోభవనం కూడా దెబ్బతింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/