సీఏఏకు వ్యతిరేకంగా నేడు అసెంబ్లీలో దీదీ తీర్మానం

తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తిలేదని ప్రకటన

MAMATA BENARGEE
MAMATA BENARGEE

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సిఎం మమతాబెనర్జీ అసెంబ్లీలో నేడు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నామని, దీనికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రి పి.చటర్జీ కోరారు. సీఏఏ చట్టానికి పార్లమెంటు ఆమోద ముద్రవేసినప్పటి నుంచి దాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తేలేదని గట్టిగా చెబుతున్న మమత బెనర్జీ ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. పైగా సీఏఏకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు బీజేపీయేతర రాష్ట్రాలన్నీ తీర్మానం చేయాలని ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే దేశంలో నాలుగో రాష్ట్రం అవుతుంది. ఇప్పటికే కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానాలు ఆమోదించాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/