ఐపిఎల్‌ ఫైనల్‌కు నిగెల్‌ లాంగే అంపైర్‌

Nigel Llong
Nigel Llong

బెంగళూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అంపైర్‌ గది డోర్‌ను ధ్వంసం చేసిన ఇంగ్లండ్‌ అంపైర్‌ నిగెల్‌ లాంగ్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని బిసిసిఐ నిర్ణయించింది. బిసిసిఐ తాజా నిర్ణయంతో ఆదివారం హైదరాబాద్‌లో జరిగే ఐపిఎల్‌- 12 ఫైనల్‌ మ్యాచ్‌కు నిగెల లాంగ్‌ యధావిధిగా అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఐపిఎల్‌ మ్యాచ్‌ల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సన్‌రైజర్స్‌ మొదట బ్యాటింగ్‌ చేస్తుండగా..ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ను బెంగళూరు పేస్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ వేస్తున్నాడు. ఆ ఓవర్‌లోని ఒక బంతిని అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించారు. రీప్లేలో అది సరైన డెలివరీ అని తేలడంతో..ఉమేశ్‌తో పాటు కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది నో బాల్‌ ఎలా అవుతుందని ఉమేశ్‌ ప్రశ్నించగా..అంపైర్‌ ఆగ్రహం వ్యక్తం చేసి బౌలింగ్‌ వేయడానికి వెళ్లాలని సూచించాడు. ఇన్నింగ్స్‌ తర్వాత అంపైర్లకు కేటాయించిన రూమ్‌కు ఆగ్రహంతో వెళ్లిన లాంగ్‌ డోర్‌ను కాలితో గట్టిగా తన్నడంతో డోర్‌ ధ్వంసం అయింది. అనంతరం స్టేడియం అధికారులతో గొడవ తర్వాత కర్ణాటక క్రికెట్‌ సంఘాని(కెసిఏ)కి లాంగ్‌ రూ. 5 వేలు చెల్లించాడు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/