మే 17న ఆస్ట్రేలియాలో ఎన్నికలు

Scott Morrison
Scott Morrison


మెల్‌బోర్న్‌: ప్రపంచంలోని అతిచిన్న ఖండమైన ఆస్ట్రేలియాలో ఎన్నికల సందడి నెలకొంది. ఆస్ట్రేలియాలో మే 17న సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఈ రోజు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలు ఆస్ట్రేలియాలో కన్జర్వేటివ్‌ పార్టీ గెలుస్తుందో, లేదా లేబర్‌ అడ్మినిస్ట్రేషన్‌ పార్టీ గెలుస్తుందో నిర్ణయిస్తాయి. ప్రతినిధుల సభలో 151 సీట్లుంటే , సెనేట్‌లో సగం అంటే 76 సీట్లు ఉన్నాయి. ఈ సారి ఎన్నికలు ఆస్ట్రేలియాలోని వాతావరణ మార్పులు, ఆర్థిక వ్యవస్థతోని పోటీ పడుతున్నట్లున్నాయని పలువురు నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు తర్వాతి దశాబ్ధంలో ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను నిర్ధారిస్తుందని ప్రధాని మోరిసన్‌ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/