ఐపిఎల్‌లో ఘోరంగా విఫలమైన బ్యాట్స్‌మెన్‌

Ashton Turner
Ashton Turner, australia batsman


జైపూర్‌: టి20ల్లో అతి ఘోరంగా విఫలమైన ఆటగాళ్లలో ఆస్ట్రేలియన్‌ బ్యాట్స్‌మన్‌ ఆష్టోన్‌ టర్నర్‌ గత ఐదు మ్యాచుల్లో పరుగుల రికార్డు ఇది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఒకే మ్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కాని టర్నర్‌ ప్రదర్శన చూసిన రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం కూడా అతగాడిపై ఎన్నో ఆశలుపెట్టుకుంది. ఐతే రాజస్థాన్‌ తరఫున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా డకౌట్‌ అయ్యాడు. అంతకు ముందు బిగ్‌షాట్‌ లీగ్‌లో చివరి రెండు మ్యాచుల్లో కూడా సున్నాకే వెనుదిరిగాడు. ఇలా వరుసగా డకౌట్‌ అవుతూ కనీసం బౌలర్లకు కూడా అందని రికార్డు సొంతం చేసుకున్నాడీ ఆస్ట్రేలియాన్‌ హార్ట్‌ హిట్టర్‌. ఈ ఐపిఎల్‌లో ఘోరంగా విఫలమైన ఆటగాళ్లలో మొదటిస్థానం సొంతం చేసుకున్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆటగాడు తీవ్రంగా నిరాశపరచడంతో క్రికెట్‌ అభిమానులు ట్విట్టర్‌ వేదికగా టర్నర్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/