అమిత్‌షాకి సవాల్‌ విసిరిన అసదుద్దీన్‌ ఓవైసీ

వారితో ఎందుకు చర్చించాలి? కావాలంటే నాతో చర్చించండి

Asaduddin Owaisi
Asaduddin Owaisi

హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకి సవాల్‌ విసిరారు. పౌరసత్వ సవరణ చట్టంపై మంగళవారం లక్నోలో బీజేపీ నిర్వహించిన అనుకూల కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై రాహుల్‌ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌ తనతో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. వారితో ఎందుకు చర్చించాలి? కావాలంటే నాతో చర్చించండి అని అమిత్‌ షాకు కౌంటర్‌ ఇచ్చారు. అదే విధంగా నేను ఇక్కడ ఉన్నాను. మీరు నాతో చర్చించండి. వారితో చర్చిస్తే ఏం వస్తుంది. ఇప్పుడు చర్చ జరగాల్సింది గడ్డం ఉన్న ముస్లిం వ్యక్తితో కదా అని ఒవైసీ విమర్శలు గుప్పించారు. అదే విధంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ ముస్లింలపై వివక్ష చూపుతున్నాయని ఓవైసీ ఆరోపించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/