మోదిపై పోటీకి హర్యానా వాసులు!

kejriwal
kejriwal


న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోది మరోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తుండగా, సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్ధిగా తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ బరిలోకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎస్పికి బిఎస్పి మద్దతుండడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. ఈ విషయమై ఢిల్లీ సియం అరవింద్‌ కేజ్రివాల్‌ స్పందించారు. గత ఎన్నికల్లో కేజ్రివాల్‌ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఐతే వీరిద్దరూ హర్యానాకు చెందిన వారు కావడం విశేషం. మోదిపై పోటీ చేస్తున్న వారు ఆ రాష్ట్రం నుంచే వస్తున్నారని కేజ్రివాల్‌ పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/