నేరస్థులకు జైలులో విలాసవంతమైన సౌకర్యాలు

నీరవ్‌ మోది, మాల్యాల కోసం జైలు గదులు సిద్దం

Arthur Road cell
Arthur Road cell

ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఆర్ధిక నేరస్థులు ఉండబోయే జైలు గదులను చూసి ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. 24 గంటలు నీటి సదుపాయం, సీలింగ్‌ను తాకేలా పొడవైనా ఫ్రెంచ్‌ కిటికీలు, ఫ్యాన్లు, కళ్లు జిగేలుమనిపించే లైట్లు, మెత్తటి పరుపులున్న విలాసవంతమైన మంచాలు, తెల్లటి పెయింట్‌ వేసి నిగనిగలాడుతున్న గోడలు, సిసి కెమెరాలు ఇలా స్టార్‌ హోటల్లో ఉండే సకల సదుపాయాలు వీరికి అమర్చారు. ఇంతకీ వారు ఉండబోయే జైలు ముంబైలోని లోయర్‌ పారెల్‌ పరిధిలోని జేఆర్‌ బొరీచా మార్గంలో ఉంది. దీని పేరు ఆర్థర్‌ రోడ్‌ జైలు. బుధవారం నాడు నీరవ్‌ మోది బెయిల్‌ పిటిషన్‌ లండన్‌ కోర్టు కొట్టేసింది. ఇలా బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురువ్వడం ఇది నాలుగోసారి. దీంతో ముంబై పోలీసులు జైలు గదిని సిద్ధం చేస్తున్నారు. వీరి గదులో సిసి కెమెరాలు అమర్చి వాటిని 24 గంటలు పర్యవేక్షించడమే కాకా వారితో ఎప్పుడైనా వీడియె కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడాలనుకుంటే అందుకు ఉపయోగంగా ఉంటాయని వీటిని అమర్చారు. విజయ్‌ మాల్యా కేసు కూడా జూలైలో విచారణకు రానుండడంతో ఇతనికి కూడా శిక్ష పడే అవకాశం ఉండడంతో ఇద్దరినీ ఒకే సెల్‌లో ఉంచుతారని సమాచారం. సాధారణంగా అక్కడి జైల్లో ముగ్గురు ఖైదీలను ఉంచుతారు. కానీ వీరిద్దరి విషయంలో మాత్రం కాస్త నిబంధనలకు తిలోదకాలిచ్చినట్లు తెలుస్తుంది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos