మధ్యప్రదేశ్‌పై ‘సుప్రీమ్’ లో వాదోప వాదాలు

రాజీనామాల పై నిర్ణయం తీసుకోవాలని
స్పీకర్‌కు ఆదేశం

Supreme court
Supreme court

New Delhi: మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టులో వాదోపవాదాలకు దారితీసింది. పదహారు మంది కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్‌ అసెంబ్లి స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతిని ఆదేశించింది.

రెబెల్‌ ఎమ్మెల్యేలు మళ్లిఎన్నికలను ఎదుర్కోవాలని, ఆతర్వాతే అసెంబ్లిలో బలపరీక్ష జరగాలని కాంగ్రెస్‌ కోర్టులో పట్టుపట్టింది.

విచారణను గురువారానికి వాయిదా వేశారు. అంతకు ముందు జరిగిన వాదనల్లో..బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని కాంగ్రెస్‌ తరపు సీనియర్‌ అడ్వకేట్‌ దుష్యంత్‌ దావె సుప్రీంకోర్టులో వాదించారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేయడం ద్వారా బీజేపీ కుట్రపన్ని, పదిహేను నెలల కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పన్నాగాలు పన్నిందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.

కిడ్నాపైన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీ తరపున ముకుల్‌ రోహ్తగీ వాదనలు వినిపిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ గెలవలేమన్న భయంతోనే సభలో బలనిరూపణను తప్పించుకుంటున్నదని కోర్టుకి వినిపించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసంhttps://www.vaartha.com/news/business/