‘దబాంగ్‌’ సీక్వెల్స్‌ గురించి సల్మాన్‌కే తెలుసు

salman khan, arbaaz khan
salman khan, arbaaz khan

ముంబై: దబాంగ్‌ సీక్వెల్స్‌ ఇంకా ఎన్ని వస్తాయనే విషయం తన సోదరుడు సల్మాన్‌ ఖాన్‌పై ఆధారపడి ఉంటుందని అర్బాజ్‌ఖాన్‌ అన్నారు. ప్రస్తుతం దబాంగ్‌ 3 షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అర్బాజ్‌ ఖాన్‌ నిర్మాత. సోనాక్షి సిన్హా కథానాయిక. ఈ సినిమాలో అర్బాజ్‌ ఓ కీలకపాత్రను కూడా పోషిస్తున్నారు.
దబాంగ్‌ సీక్వెల్స్‌ గురించి తాజాగా మీడియా అర్బాజ్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ ఓ నటుడిపై నడిచే సీక్వెల్‌ ఇది. మూడో భాగం తీయడానికి మాకు మూడేళ్లు పట్టిందని, తర్వాత సీక్వెల్‌ తీయడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేమని అన్నారు. అది కేవలం సల్మాన్‌పై ఆధారపడి ఉందని ఆయన సమాధానమిచ్చారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/