పౌరసత్వ దరఖాస్తుకు సోషల్‌మీడియా ఐడి తప్పనిసరి

us citizenship
us citizenship


న్యూఢిల్లీ: అమెరికా పౌరసత్వం కావాలా అయితే మీరు ముందు మీకున్న సోషల్‌మీడియా ఐడిలు ఇవ్వాల్సిందే. ఇందుకు సంబంధించిన ఇ-ఫారాలు, డి-160ఫారాల్లోను, డి-260 ఫారాల్లో కూడా వీటిని అందచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమతమ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లతోసహా ముందు అన్ని సోషల్‌మీడియా ఐడిలను అమెరికా ఇమ్రిగ్రేషన్‌ అధికారులు కోరినవిధంగా అందించాల్సి ఉంటుంది. అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ జారీచేసిన మార్గదర్శకాల్లోముందు సోషల్‌మీడియా ఐడిలను ముఖ్యంగా గుర్తించింది. ఇందుకు సంబంధించి ఈనెల 4వ తేదీనే అమెరికా ఫెడరల్‌ రిజిష్టరులో నోటిపికేషన్‌సైతం వెలువరించింది. అంతేకాకుండా వీటిపై అభిప్రాయాలు సూచనలను రానున్న 60 రోజుల్లో అందించాలనికోరింది. పర్యాటకులు, విద్యార్ధులు, ఎవరైతే ఉద్యోరీత్యా అమెరికాకు వస్తున్నారుభారత్‌నుంచి వచ్చే వివిధ రంగాలవరు మొత్తంగా ఈ విధానాన్ని పాటించాల్సిందే. గడచిన ఐదేళ్లలో ఏఏ సోషల్‌మీడియా ఐడిలున్నాయో అన్నింటినీ ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తుల్లో పొందుపరచాలి. అమెరికాలో గ్రీన్‌కార్డులు పొంఆలనుకునేవారు హెచ్‌వన్‌బి వర్కర్లు లేదా ఇంట్రా కంపెనీ బదిలీల్లో ఉన్న ఎల్‌వన్‌ వీసాదారులు కూడా వీటిని పాలించాలి. అలాగూఏ గ్రీన్‌ కార్డుకోసం దరఖాస్తుచేసినవారు, మరోసారి అమెరికాకు రావాలని కోరే పరిమతులకోసం దరఖాస్తుచేసేవారు కూడా వీటిని విధిగా పాటించాలని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ వెల్లడించింది.

అమెరికానుంచి రెండేళ్లపాటు బయట ఉండాలనుకున్నవారు సైతం తప్పనిసరిగా మార్గదర్శకాలు పాటించాలని కొత్త నిబందనలు వెలురవించింది. 60వేల మందికిపైగా ఉన్న భారతీయులు గ్రీన్‌కార్డులు పొంది ఉన్నారు. 2017 సెప్టెంబరు 30వ తేదీ నాటికి సుమారు 50వేల మందికిపైగా అమెరికా పౌరసత్వం లభించిందని అంచనా. ప్రస్తుతం డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌సెక్యూరిటీలోవిభాగంగా ఉన్న అమెరికా పౌరసత్వం,వలసలవిభాగం (యుఎస్‌సిఐఎస్‌) దరఖాస్తుదారులు సోషల్‌మీడియా సమాచారం ఇవ్వనిపక్షంలో వారి దరఖాస్తులను స్వీకరించబోదు. అంతేకాకుండా వారిదరఖాస్తులు పెండింగ్‌లో ఉంటాయి. ఇటీవలి కాలంలోనే అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు బోగస్‌ ఖాతాలు గుర్తింపులను సైతం సృష్టించి గ్రీన్‌కార్డులకోసం దరఖాస్తుచేసేవారి సమాచారాన్ని రాబట్టే అవకాశం కూడా ఉంది. అమెరికా మీడియా కథనాలప్రకారంచూస్తే ఫేస్బఉక్‌ ఎలాంటి బోగస్‌ ప్రొఫైల్స్‌ సృష్టించడానికి అనుమతించబోమని స్పస్టంచేసినట్లు సమాచారం. తమ కంపెనీ నియమనిబంధనల్లో ఇందుకు సంబంధించి ఎలాంటి మార్పులు,సవరణలు కూడా తీసుకువచ్చే ప్రశ్నేలేదని, వ్యక్తుల చిరునామాలు వ్యక్తిగత సమాచారం గోప్యతను పాటిస్తామని ఫేస్‌బుక్‌ యాజమాన్యం ప్రకటించడంతో ఇపుడు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మరింత కఠినతరమైన నిబందనలు అనుసరించాలనిచూస్తున్నారు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి..