త్వరలో ఆన్‌లైన్‌ అమ్మకాలు

Apple Onilne Sales
Apple Onilne Sales

భారత్‌లో ఆన్‌లైన్‌ అమ్మకాలతో పాటు సంప్రదాయ విక్రయశాలలు కూడా ప్రారంభించేందుకు చర్యలు వేగవంతం చేశామని అమెరికా సాంకేతిక దిగ్గజం యాపిల్‌ వెల్లడించింది. ఏక బ్రాండ్‌ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) నిబంధనలను ప్రభుత్వం సడలించిన మరుసటి రోజే యాపిల్‌ ఈ ప్రకటన చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు తొలుత యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారానే దేశీయంగా అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంది. తదుపరి విదేశాల్లో ఏర్పాటు చేసిన తరహాలోనే దేశీయంగా సొంత విక్రయశాలలు నెలకొల్పుతుంది.