ప్రొటెం స్పీకర్‌గా అప్పలనాయుడు!

appala naidu
appala naidu, vijayanagaram mla


అమరావతి: ఏపిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ నెల 12న శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు నియమితులయ్యే అవకాశముంది. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన అనంతరం శాసనసభ సమావేశాల తొలిరోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు.

ఆ తర్వాత శాసనసభ స్పీకర్‌ ఎన్నిక కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన శాసనసభాపతికి పదవీ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన పదవీకాలం ముగుస్తుంది. ప్రొటెం స్పీకర్‌ను గవర్నర్‌ నియమిస్తారు. సీనియారిటీ ప్రకారం శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడుని ప్రొటెం స్పీకర్‌గా నియమించేందుకు ఎక్కువ అవకాశాలు కన్పిస్తున్నాయి. త్వరలో గవర్నర్‌ నుంచి ఇందుకు సంబంధించి ఆదేశాలు రానున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/