2019 ఎన్నికలలో బిజెపికి సినిమా చూపిస్తాం

AP MINISTER LOKESH
AP MINISTER LOKESH

2019 ఎన్నికలలో బిజెపికి సినిమా చూపిస్తాం: మంత్రి లోకేష్‌

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను విస్మరించిన బిజెపి ప్రభుత్వానికి 2018లో జరిగిన కర్ణాటక ఫలితాలు సినిమా ట్రైలర్‌ లాంటిదని 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో పూర్తిస్థాయి సినిమా చూపిస్తామని ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటి, గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో భాగంగా శనివారం ఒంగోలులో జరిగిన దీక్షా కార్యక్రమంలో నారా లోకేష్‌ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నమ్మకద్రోహోనికి పాల్పడిన బిజెపికి రోజులు దగ్గర పడ్డాయన్నారు.

ప్రకాశం జిల్లాకు వస్తే టంగుటూరు ప్రకాశం పంతులు గుర్తుకు వస్తాడని, ప్రకాశం పోరాట స్పూర్తితో కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. నాలుగు సంవత్సరాల పాటు బిజెపితో కలసి ఉన్నా రాష్ట్రానికి న్యాయం చేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను తట్టుకోలేక నాలుగు సంవత్సరాలు వేచి చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి బిజెపి ఇటీవల జరిగిన ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించుకుందని తెలిపారు.

కర్ణాటక ఎన్నికలలో తెలుగు వారు బిజెపికి ఓట్లు వేయకపోవ డంతోనే అధికారానికి దూరం అయ్యిందనే విషయం ఆలస్యంగా బిజెపి గుర్తించిందన్నారు.