సహాయ మంత్రి పదవిపై అనుప్రియ కినుక

anupriya patel
anupriya patel

న్యూఢిల్లీ: ఎన్‌డిఎ మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ తమ పార్టీ నేత అనుప్రియ పటేల్‌కు గతంలో మాదిరిగానేసహాయ మంత్రి పదవిని ఆఫర్‌చేయడంతో ఆమె తిరస్కరించారు. అప్నాదళ్‌ నాయకులు బిజెపి కేంద్రమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌తమకు యుపి ప్రచారంలో కేబినెట్‌ ర్యాంకు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇపుడుప్రధానమంత్రి తన హామీని నిలబెట్టుకోవాలని పార్టీ కేడర్‌ కోరుతోంది. అనుప్రియ పటేల్‌కు ప్రమాణస్వీకారానికి సిద్ధం కావాలని ఫోన్‌కాల్‌ వచ్చింది. అయితే సహాయ మంత్రిగా ఇవ్వడంపట్ల ఆమె తీవ్రనిరసన వ్యక్తంచేసారు. 2014నుంచి ఎన్‌డిఎలోనే కొనసాగుతున్నప్పటిక ఈమిత్రపక్షం పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారన్న విమర్శలు బిజెపిపై పెరిగాయి. తొలుత పటేల్‌కు మంత్రిపదవిని కేబినెట్‌ర్యాంక్‌తో ఇస్తామన్నారని, అందువల్లనే ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించారని చెపుతున్నారు. యుపిలోని కురుమ ఓటుబ్యాంకు బేస్‌తో ఉన్న ఈ పార్టీకి ఇద్దరు ఎంపిలు గెలిచారు. అలాగే శాసనసభలో కూడా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. వీరిలో ఒకరు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. కురుమ ఓటుబ్యాంకు, ఒబిసి పరంగా మంచి పట్టున్న పార్టీ కావడంతో బిజెపితో దోస్తీ కట్టింది. మరోసారి విస్తరణలో చూపించే అవకాశం కంటే ఇప్పటికిప్పుడు తమ నేతకు కేబినెట్‌మంత్రిపదవిని కట్టబెట్టాలన్న డిమాండ్‌వస్తోంది. పూర్వాంచల్‌ప్రాంతంలో కేవలం ఒక్కరికేమంత్రిపదవి లబించింది. బిజెపి అధ్యక్షుడు మహేంద్రనాద్‌పాండేకు మాత్రమే కేబినెట్‌ర్యాంక్‌ వచ్చింది. అనుప్రియ పటేల్‌ మీర్జాపూర్‌ నుంచి ఎన్నికైతే పఖౌరిలాల్‌కోల్‌ రాబర్ట్స్‌గంజ్‌నుంచి ఎన్నికయ్యారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/