ఆర్‌ ఇన్‌ఫ్రా కీలకమైన ఆస్తులు విక్రయానికి పెట్టిన్ను అంబానీ

ముంబయి : అనిల్‌ అంబానీ నేతృత్వంలోని అడాగ్‌కు చెందిన ఆర్‌ ఇన్‌ఫ్రా కిలకమైన ఆస్తులను విక్రయానికి పెట్టినున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ లో ఆగ్రా టోల్‌ రోడ్‌వేలో మొత్తం వాటాను సింగపూర్‌కు చేందిన క్యూబ్‌ హైవేకు రూ.3,600 కోట్లకు విక్రయించనుంది.దీంతో కంపేనీ అప్పు 25శాతం తగ్గి రూ.5వేల కోట్ల లోపు ఉంటుంది.ఇప్పటికే రిలయన్స్‌ ఇన్‌ఫ్రా క్యూబ్‌ హైవేస్‌తో ఒప్పందం కూడా చేసుకొంది.ఈ ఒప్పందం ప్రకారం ఢిల్లీ ఆగ్రా టోల్‌రోడ్‌లో 100శాతం వాటాను విక్రయించనుంది. ఆర్‌ ఇన్‌ఫ్రా చెందిన డీఏ టోల్‌ రోడ్‌ సంస్థ మొత్తం 180 కిలోమీటర్ల ఢిల్లీ ఆగ్రా హైవేను నిర్వహిస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం బిజినేస్‌ క్లిక్‌ చేయండి
https://www.vaartha.com/news/business/