ధోనికి 50 శాతం మ్యాచ్‌ ఫీజులో కోత

DHONI
DHONI


జైపూర్‌: ధోనికి ఐపిఎల్‌ యాజమాన్యం జరిమానా విధించింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా డగౌట్‌లో ఉన్న ధోని మైదానంలోకి ప్రవేశించి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడని, ఆయన ఐపిఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన రెండో స్థాయి నేరంగా పరిగణిస్తూ జరిమానా విధించారు. జరిమానా కింద ధోనికి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత పడింది.
జైపూర్‌ వేదికగా గురువారం చెన్నై, రాజస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. చెన్నైకి ఆఖరులో మూడు బంతులకు 9 పరుగులు చేయాల్సి ఉండగా, క్రీజులో ఉన్న శాంటర్న్‌కు రాజస్థాన్‌ బౌలర్‌ బెన్‌ స్టోక్స్‌ వికెట్ల ఎత్తులో బంతిని విసిరాడు. మైదానంలో అంపైర్లుగా ఉన్న ఉలాస్‌ గాందే, బ్రూస్‌ ఆక్స్‌ఫర్డ్‌ తొలుత నోబాల్‌గా ప్రకటించారు. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. దీంతో డగౌట్‌లో ఉన్న ధోని మైదానంలోకి వచ్చి అంపైర్లతో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో జరిమానా విధించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/