దూసుకొస్తున్న అంఫాన్‌ తుపాన్‌

బెంగాల్ వైపుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

cyclone-amphan

ఒడిశా: అంఫాన్‌ తుపాన్‌ పశ్బిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అది ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. అటు బెంగాల్‌ కూడా వాతావరణం మారింది. అక్కడ కూడా వర్షాలు మొదలయ్యాయి. ఆ రెండు రాష్ట్రాల్లో 3 లక్షల మందిని తీర ప్రాంత జిల్లాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం తుఫాను బెంగాల్ వైపుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈదురు గాలులు గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/