ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అమిత్‌షా సూచన

జేఎన్‌యూ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ తో అమిత్ షా

Amit Shah - Delhi LG Anil Baija
Amit Shah – Delhi LG Anil Baija

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జేఎన్ విశ్వవిద్యాలయం పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేసి తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే. నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు కేంద్రం ఉపకమ్రించింది. దీంతో ఈ విషయంలో అవసరమైన నష్టనివారణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. అమిత్ షా లెఫ్టినెంట్ గవర్నర్తో ఫోన్లో ఈ రోజు ఉదయం మాట్లాడారు. అవసరమైన సూచనలు చేశారు. ఘటన పై పోలీసులు ప్రాథమిక ఆధారాలతో ఎస్ఎఆర్ కూడా నమోదు చేశారు. మరోవైపు వర్సిటీ వైస్ చాన్సలర్ ఎం.జగదీష్ కుమార్ స్పందిస్తూ జరిగిన ఘటన దురదృష్టకరమని, విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో తరగతులు యథావిధిగా సాగుతాయని, వింటర్ సెమిస్టర్ రిజిస్ట్రేషన్ సజావుగా సాగేలా చూస్తామని తెలిపారు. కాగా, నిన్న ఘటనలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/