పాకిస్థాన్‌కు అమెరికా హెచ్చరిక

America-Pakistan
America-Pakistan

హైదరాబాద్‌: భారత్‌పై ఉగ్రదాడి జరిగితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అగ్రరాజ్యమైన అమెరికా పాకిస్థాన్‌ను హెచ్చరించింది. ఉగ్రవాద నిర్మూలన కోసం సంపూర్ణమైన చర్యలు తీసుకోవాలని పాక్‌కు తాజాగా అమెరికా వార్నింగ్‌ ఇచ్చింది. అంతేకాక భార‌త్‌పై మ‌ళ్లీ ఏదైనా ఉగ్ర‌దాడి జ‌రిగితే, అప్పుడు ప‌రిస్థితి అత్యంత స‌మ‌స్యాత్మ‌కంగా మారుతుంద‌ని అమెరికా ప్ర‌భుత్వం వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. జైషే మ‌హ్మ‌ద్‌, ల‌ష్క‌రే తోయిబా లాంటి ఉగ్ర సంస్థ‌ల‌ను సంపూర్ణంగా నివారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైట్‌హౌజ్ అధికారులు మీడియా ప్ర‌తినిధుల‌తో తెలిపారు. మ‌రోసారి భార‌త్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగితే, మ‌ళ్లీ రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తుతాయ‌ని, అప్పుడు రెండు దేశాల‌కు ప్ర‌మాదం ఉంటుంద‌ని అమెరికా అధికారి ఒక‌రు హెచ్చ‌రించారు. బాలాకోట్ దాడి త‌ర్వాత పాక్ ఏమైనా చ‌ర్య‌లు తీసుకుందా అన్న ప్ర‌శ్న‌కు అమెరికా అధికారులు స‌మాధానం ఇచ్చారు. ఉగ్ర వాద నిర్మూల‌న కోసం స‌మ‌గ్ర‌మైన చ‌ర్య‌లను పాక్ తీసుకోవాల‌న్నారు. పాక్ చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను ఇప్పుడు అంచ‌నా వేయ‌లేమ‌ని, ప్ర‌స్తుతానికి ఉగ్ర సంస్థ‌ల ఆస్తుల‌ను సీజ్ చేశార‌ని, కొంద‌రు ఉగ్ర‌వాదుల‌ను కూడా అరెస్టు చేశార‌ని, జేషై స్థావ‌రాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు. పాక్ మ‌రిన్ని తిరుగులేని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, దీని కోసం అంత‌ర్జాతీయ దేశాల‌తో క‌లిసి తాము పాక్‌పై వ‌త్తిడి తెస్తున్నామ‌ని అమెరికా చెప్పింది.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/